అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని కోరుతూ బుధవారం కర్నూల్ కలెక్టరేట్ ఎదుట ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల భారత యువజన సమాఖ్య కర్నూలు జిల్లా శాఖ అధ్యక్షులు శ్రీనివాసులు మాట్లాడుతూ అగ్నిపథ్ పథకాన్ని రద్దుచేసి పాత పద్ధతిలోనే ఆర్మీ రిక్రూట్మెంట్ ని నిర్వహించాలని డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.