గిద్దలూరు పట్టణంలోని ఐసిడిఎస్ కార్యాలయం వద్ద శుక్రవారం మలేరియా వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని అంగన్వాడీలు మలేరియా పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు మలేరియా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించి చెప్పారు. ముఖ్యంగా దోమల వల్ల మలేరియా వ్యాప్తి చెందుతుందని ప్రజలందరూ మీ పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకుంటూ దోమలు లేకుండా చూసుకోవాలని అంగన్వాడీలు ప్రజలకు సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa