లడఖ్‌లోని న్యోమా-చుషుల్ ప్రాంతం శనివారం విషాద ఘటన జరిగింది. సైనిక డ్రిల్‌లో భాగంగా T-72 యుద్ధ ట్యాంక్‌తో ఐదుగురు జవాన్లు నది దాటారు. అర్ధరాత్రి 1 గంట సమయంలో వరద ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. దీంతో వరదలో యుద్ధ ట్యాంక్ కొట్టుకుపోయింది. దానిలోని ఐదుగురు జవాన్లు జలసమాధి అయినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఒకరి మృతదేహం లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.