శ్రీకాకుళం సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ (డీటీ) రొక్కం శ్రీనివాసరావు(43) శుక్రవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కోటబొమ్మాళి మండలం నీలంపేట గ్రామా నికి చెందిన శ్రీనివాసరావు శ్రీకాకుళంలోని డీసీసీబీ కాలనీలో భార్య నళిని, ఏడేళ్ల కుమార్తెతో నివాసం ఉంటున్నారు. కొన్నేళ్లుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. శుక్రవారం ఉదయం నళిని తమ కుమార్తెను స్కూల్లో దింపేందుకు వెళ్లింది. ఆమె తిరిగి ఇంటికి వచ్చేసరికి శ్రీనివాసరావు ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ వాసుదేవరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్(రిమ్స్)కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.