ఎచ్చెర్ల నియోజకవర్గంలోని ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తామని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు (ఎన్‌ఈఆర్) అన్నారు. శుక్రవారం వెంకటాపురం నుంచి అదపాక వరకు రూ 3.17 కోట్ల నిధులతో 7.6 కిలోమీటర్ల మేరా నిర్మాణం చేప ట్టనున్న బీటీ రోడ్డు పనులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. దశల వారీగా నియోజకవర్గంలోని ప్రతీ గ్రామానికి బీటీ రోడ్లు నిర్మాణాలు చేపడతామని చె ప్పారు. సీఎం చంద్రబాబు అంటేనే అభివృద్ధికి చిరునామాగా చెప్పుకోవచ్చునన్నారు. ప్రధాని మోదీ సహకారంతో నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతానన్నారు. తోటపల్లి కాలువ పనులు నిలిచి పోయిన నుంచి సొంత నిధులు వెచ్చించి పూర్తి చేయిస్తానన్నారు. బుడుమూరు నారాయణసాగర్‌ను, ఎస్‌ఎం పురం పెద్ద చెరువును మినీ రిజర్వాయర్లుగా అభివృద్ధి చేయిస్తానని తెలిపారు. నిరుద్యోగ యువతకు స్థానిక పరిశ్రమల్లో ఉద్యోగాలు వేయిస్తామన్నారు. ఎచ్చెర్ల్లను ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతానన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను స్థానిక ప్రజా ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. అనంతరం లావేరు జడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించి, విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. కార్యక్ర మంలో పీర్ డీఈ సీతంన్నాయుడు, ఏఈ అప్పన్న, ఎంపీడీవో కొండలరావు, కూటమి నాయకులు విశ్వక్షేన్, ముప్పిడి సురేష్, ఇజ్జాడ శ్రీనివాసరావు, గంట్యాడ మహేష్ తదితరులు పాల్గొన్నారు.