నెల్లిమర్లలోని ఈవీఎం గోదాములను నూతన కలెక్టర్ అంబేద్కర్ శుక్రవారం తనిఖీ చేశారు. సీసీ కెమేరాలు, గొడౌన్‌లకు వేసిన తాళాలు, సీళ్లను పరిశీలించారు. అక్కడి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. అప్రమత్తంగా ఉండాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. ఈవీఎం గోదాములకు ఇరువైపులా వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూడాలని ఇంజినీరింగ్, మున్సిపల్ అధికారులను ఆయన ఆదేశించారు. ఇరువైపులా చెరువుల్లా మారిన పల్లపు ప్రదేశాలను పరిశీలించారు. ఆ నీరు బయటకు పోయే మార్గాలపై ఆరా తీశారు. లోతట్టు ప్రాంతాలను మట్టితో కప్పివేయాలని, నీరు పోవడానికి పైప్‌లైన్ వేయాలని, ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సూచించారు. దీనిపై సమగ్ర ప్రణాళికను రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో అనిత, ఆర్డీవో ఎంవీ సూర్యకళ, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ బి.ఉమాశంకర్, ఇరిగేషన్ ఈఈ ఎం.సీతారామ్‌నాయుడు, నగర పంచాయతీ కమిషనర్ బాలాజీప్రసాద్, ఎన్నికల విభాగం సూపరింటె ండెంట్ ప్రభాకర్, తహసీల్దార్ డి.ధర్మరాజు, డిప్యూటీ తహసీల్దార్ మూర్తి, రాజకీయ పార్టీల ప్రతినిధులు సముద్రపు రామారావు, రేగాన శ్రీనివాసరావు, రాజారావు పాల్గొన్నారు.