పులివెందుల్లో నివాసముంటున్న ఆర్టీసీ డ్రైవర్ జయరాంకు చెందిన కారును గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం ధ్వంసం చేశారు. ఇంటి ఎదుట నిలిపి ఉంచిన కారును దుండగులు రాళ్లతో కొట్టారు. ఈ ఘటనలో కారు ముందు భాగంలోని అద్దం ముక్కలైంది. ఇంటి బయట ఉన్న ద్విచక్ర వాహనాన్ని సైతం ధ్వంసం చేయడంతో రూ. 40 వేల నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపారు. పోలీసులు చర్యలు తీసుకుని న్యాయం చేయాలని అతడు కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa