రాయచోటి మండలంలోని సోమవారం మిట్టావాండ్లపల్లి గ్రామంలో సోమవారం ఉదయం 6గంటలకే రాష్ట్ర రవాణాశాఖ క్రీడా యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు ఎలక్షన్లో వాగ్దానం చేసిన విధంగా రూ. 7000 పెన్షన్ ను టిడిపి మాజీ కౌన్సిలర్ మిట్టా సంజీవరెడ్డి, సచివాలయ సిబ్బంది ద్వారా పింఛన్లు పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామీల అమలుకు శ్రీకారం చుట్టడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.