రాయదుర్గం: గుమ్మఘట్ట మండలంలోని భైరవాని తిప్ప ప్రాజెక్టులో జులై 1 నుంచి ఆగస్టు 31 వరకు చేపల వేటను నిషేధిస్తున్నట్లు గుమ్మఘట్ట ఎఫ్ డీ ఓ లక్ష్మీనారాయణ సోమవారం మీడియాకి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సమయంలో చేపలు తమ సంతానోత్పత్తి ప్రక్రియ కొనసాగిస్తాయని పేర్కొన్నారు. మత్స్యకారులు ఈ విషయాన్ని గమనించి వేటకు దూరంగా ఉండాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వేట సాగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.