చిట్వేలు మండలం చెర్లోపల్లి లోని సురక్షిత త్రాగునీటి శుద్ధి కేంద్రాన్ని రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్, రైల్వే కోడూరు నియోజకవర్గ టిడిపి బాధ్యులు ముక్కా రూపానందరెడ్డి భార్య వరలక్ష్మి రిబ్బన్ కత్తిరించి పున: ప్రారంభించారు. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నాగార్జున, మాజీ ఎంపీటీసీ శివ ప్రసాద్ రాజు, రాజుగుంట సర్పంచ్ గుత్తి నరసింహ, ఈశ్వరయ్య, మాదాసు శివ పాల్గొన్నారు.