నల్లచెరువు మండలం శ్రీ పాలపాటిదిన్నె ఆంజనేయస్వామి దేవస్థానంలో దేవదాయశాఖ అధికారులు శాశ్వత హుండీలను లెక్కించారు. హుండీల ద్వారా ఆలయానికి రూ. 4, 78, 663 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి రవీంద్ర రాజు మంగళవారం తెలిపారు. హుండీల లెక్కింపును పుట్టపర్తి అసిస్టెంట్ కమిషనర్ నరసింహ రాజు పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఆలయ మాజీ ఛైర్మన్ దేవరింటి భాస్కర్ రెడ్డి, గ్రామస్థులు పాల్గొన్నారు.