గుంతకల్లు పట్టణం పాత గుంతకల్లుకు చెందిన కృష్ణవేణి(26)అను మహిళ కడుపునొప్పి తట్టుకోలేక సోమవారం ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు రెండవ పట్టణ సీఐ గణేష్ తెలిపారు. ఆమె భర్త రైల్వే స్టేషన్ రోడ్డులో టీ దుకాణం నిర్వహిస్తున్నాడు. వారికి పెళ్ళయ్యి ఐదేళ్లైనా పిల్లలు పుట్టలేదు. తరచూ కడుపునొప్పి వస్తుండడంతో ఆమె ఊరేసుకుందని తల్లి రాజమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.