రాచర్ల మండలం అనుముల వీడు గ్రామ సచివాలయంలో జూనియర్ లైన్మెన్ గా పనిచేస్తున్న సురేష్ నాయక్ సోమవారం కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. జూన్ 19వ తేదీన అనుముల వీడు సమీపంలో ఓ విద్యుత్ స్తంభంపై మరమ్మతులు చేస్తూ విద్యుత్ షాక్ కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ సురేష్ నాయక్ ను పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలుకు తరలించారు. చికిత్స పొందుతూ జూనియర్ లైన్మెన్ సురేష్ నాయక్ మృతి చెందాడు.