జమ్మూ కాశ్మీర్ లోని లడఖ్ వద్ద యుద్ధ ట్యాంకులో వెళుతూ నదిని దాటే ప్రయత్నంలో మరణించిన రేపల్లె రూరల్ మండలం ఇస్లాంపూర్ కు చెందిన సుభాన్ ఖాన్ పార్ధీవదేహం సోమవారం రాత్రి రేపల్లె చేరుకుంది. సుభాన్ ఖాన్ మృతదేహానికి రేపల్లె రెవెన్యూ డివిజన్ అధికారి హేలా షారోన్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సుభాన్ ఖాన్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. రేపల్లె తహసిల్దార్, సిబ్బంది పాల్గొన్నారు.