రేపల్లె ఆర్డీవో కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 7 అర్జీలు వచ్చినట్లు రెవెన్యూ డివిజనల్ అధికారిని హేలా షారోన్ తెలిపారు. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి సంబంధిత శాఖల అధికారులకు పంపి వాటిని తక్షణమే పరిష్కరించాలని ఆదేశించామన్నారు. ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలు తమ సమస్యలు అధికారుల దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరిస్తామన్నారు.