మండల కేంద్రం అమృతలూరు గోవాడ గ్రామాల మధ్య తెనాలి చెరుకుపల్లి ఆర్టీసీ బస్సుకు సోమవారం ప్రమాదం తృటిలో తప్పింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షంతో ఆర్ అండ్ బి రోడ్డు వెంబడి ఉన్న సైడ్ బరమ్స్ గుంతలు పడి రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. ఎదురెదురుగా వస్తున్న వాహనాలు అదుపుతప్పినప్పుడు ఇటువంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయి. డ్రైవర్ చాకచక్యంతో బస్సు నిలిపివేయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.