ఎస్బిఐ వారు పోలీస్ శాలరీ ప్యాకేజ్ కింద అందిస్తున్న ప్రమాద బీమా పాలసీని పోలీస్ ఉద్యోగస్తులందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ జి. ఆర్ రాధిక కోరారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ శాలరీ ప్యాకేజ్ కింద ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన కానిస్టేబుల్ బొడ్డేపల్లి గన్నయ్య యొక్క నామిని అయిన ఆయన సతీమణి వరహలమ్మకు రూ. 75లక్షల చెక్కును జిల్లా ఎస్పీ అందజేశారు.