గుంటూరు జిల్లా, ప్రత్తిపాడు నియోజకవర్గ అభివృద్ధికి ప్రతీనెల సమీక్షించి ప్రాధాన్యతల వారీగా లక్ష్యాలు నిర్ణయిస్తామని ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... నెల రోజులలోపు నియోజకవర్గంలో చేపట్టాలనుకున్న పనులను గుర్తించామని.. సాగు నీటి కాలువల్లో పూడిక తీత పనులు చెయ్యాలని నిర్ణయించామన్నారు. కాల్వల్లో గుర్రపుడెక్క పెద్ద ఎత్తున పేరుకుపోయి ఉందన్నారు. గత ఐదేళ్ళలో ప్రభుత్వం కాల్వల గురించి పట్టించుకోలేదని విమర్శించారు. పూడిక తీత పనులకు గాను మొదటి క్యాబినెట్లోనే సీఎం ఆమోదించారని తెలిపారు.