ఏడాది కిందట ఓ మహిళపై విచక్షణారహితంగా దాడి చేసిన ఘటనలో నిందితుడైన సస్పెక్ట్ షీటర్ ఆకుల సురేష్.. కేసు రాజీ చేసుకోలేదన్న కోపంతో మరో సారి ఆ మహిళపై దాడి చేసిన ఘటన నగరంలో చోటుచేసుకుంది. ఒకటో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శ్రీకాకుళం నగరంలోని హయాతీనగరం సమీపంలోని రెల్లవీధిలో నివసిస్తున్న ఆకుల సురేష్ ఆదివారం రాత్రి మైలపిల్లి హేమ తన కుమారుడుకి చికిత్స చేయించేందుకు రిమ్స్‌కు వెళ్లి భర్త కొర్లయ్యతో తిరిగి వస్తుండగా గూనపాలెం రామమందిరం వద్ద దాడి చేశా డు. న్యాయస్థానంలో కేసు రాజీకి ఎందుకు అంగీకరించలేదంటూ దుర్భాష లాడుతూ ఆమెపై దాడి చేశాడు. ఈ ఘటనలో హేమకు గాయాలు కావడంతో భర్త సాయంతో రిమ్స్‌కు తరలిం చారు. ఎంఎల్సీ రిపోర్టు ఆధారంగా సస్పెక్ట్ షీటర్ సురేష్‌పై వన్ టౌన్ ఎస్ఐ కామేశ్వరరావు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా కొద్ది రోజుల కిందట మంగు వారితోటలో వివాహిత కిడ్నాప్ కేసులో కూడా ఆకుల సురేష్ ఆమె భర్తపై దాడి చేసి కిడ్నాప్ చేయడంలో కీలకపాత్ర పోషించినట్టు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఆకుల సురేష్‌పై సస్పెక్ట్ షీట్ ఉండడంతో అతడు పదే పదే నేరాలకు పాల్పడుతుండడంతో అతనిపై రౌడీషీట్ తెరిచేందుకు 1టౌన్ పోలీసులు ఎస్పీకి నివేదిక అందించనున్నారు.