సీఎం చంద్రబాబు సారధ్యంలో రాష్ట్రంలోని అవ్వాతాతలు, అక్కాచెల్లెమ్మలకు భరోసా ఉంటుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత స్పష్టం చేశారు. సోమవారం ఎన్టీఆర్భరోసా పింఛన్ల పంపిణీ కల్లూరు అర్బన్, రూరల్ మండలాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల సమక్షంలో పండుగ వాతావరణంలో నిర్వహించారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత కల్లూరు అర్బన్ 19వ వార్డు గణేష్‌నగర్, 26వ వార్డు కృష్ణానగర్, 37వ వార్డు ఎన్టీఆర్ బిల్డింగ్స్, 41వ వార్డు వీకర్‌సెక్షన్ కాలనీలలో చంద్రబాబునాయుడు చిత్రపటా నికి క్షీరాభిషేకం చేసి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్ర మంలో ప్రభాకర్‌యాదవ్, పెరుగు పురుషోత్తంరెడ్డి, బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి, వంగాల జనార్దన్‌రెడ్డి, కేతూరు మధు, బీసన్న, క్రిష్ణవేణి, కే.పార్వతమ్మ, శివ, జనార్ధన్ ఆచారి, నాగేశ్వరరావు, గంగాధర్‌గౌడ్ ఎన్వీ.రామకృష్ణ పాల్గొన్నారు.