కర్నూలు నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో అరుణా నగర్లో కుమ్మరి రామాంజనేయులు అనే వ్యక్తి తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రామాంజనేయులు భవన నిర్మాణ కార్మికుడుగా పని చేస్తు న్నాడు. తాగుడుకు బానిసై అప్పులు చేశాడు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి భారాభర్తల మధ్య గొడవ జరిగింది. మద్యం తాగొద్దని భార్య మందలించింది. ఆ తర్వాత పిల్లలను తీసు కుని ఇంటినుంచి బయటకు వెళ్లిపోయింది. రామాంజనే యులు ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుంటున్నానని బంధువులకు ఫోన్ చేసి చెప్పాడు. వాళ్లు వచ్చేలోగా ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమ్మితం మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నట్లు సీఐ శంకరయ్య తెలిపారు.