ప్రతి శుక్రవారం నీటి తొట్టెలను శుభ్రం చేసి ఆరిన తర్వాత మళ్లీ నీరు నింపడం ద్వారా డెంగీ వ్యాధిని ప్రాథమిక దశలో అరికట్టే అవకాశం ఉంటుందని కలెక్టర్ పి.రంజిత్‌బాషా అన్నారు. సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరి ష్కార వేదిక కార్యక్రమంలో డెంగీ వ్యతిరేక మాసోత్సవాల్లో భాగంగా తీసుకోవాల్సిన నివారణ చర్యలకు సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ పి.రంజిత్‌బాషా, జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య ఆవిష్క రించారు. కలెక్టర్ మాట్లాడుతూ డెంగీ నివారణకు గానూ ఇంట్లో ఉన్న నీటి నిల్వలపై దోమలు గుడ్లు పెట్టకుండా మూతలు తప్పనిసరిగా ఉండా లన్నారు. ఇంటి పరిసరాల్లో కొబ్బరిబోండాలు, పాతటైర్లు, ఖాళీ డబ్బాలు, రాతిరుబ్బరోళ్లు, పనికిరాని ఎయిర్ కూలర్స్, బయట నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త వహిం చాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో మధుసూదన్‌రావు, డీఎంహెచ్‌వో ప్రవీణ్ కుమార్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.