విశాఖ జిల్లా, చింతపల్లి మండలంలోని ఎ. శనివారం కొత్తమాడెంబంద గ్రామ శివారు అటవీ ప్రాంతంలో ఎగుమతికి సిద్ధం చేసిన 254 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ కె.రమేశ్ తెలిపారు. సోమవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఓ వ్యక్తి ఒడిశా నుంచి గంజాయిని తీసుకొచ్చి మైదాన ప్రాంతాలకు తరలించేందుకు కొత్తమాడెంబంద గ్రామ శివారు కొండపై డంప్ చేశాడన్నారు. అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించి గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. గంజాయి రవాణాతో సంబంధం కలిగిన స్థానిక గిరిజనుడిని అరెస్టు చేశామన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నామన్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.12.5 లక్షలు ఉంటుందని సర్కిల్ ఇన్స్పెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ అరుణ్ కిరణ్ పాల్గొన్నారు.