రాజీవ్‌గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ పరిధిలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో ఇంటిగ్రేటెడ్ ఇంజినీరింగ్‌కు అడ్మిషన్ల ప్రక్రియను సోమవారం నుంచి ఆర్జీయూకేటీ అడ్మిషన్స్ కన్వీనర్ ప్రొఫె సర్ ఎస్. అమరేంద్రకుమార్ ప్రారంభించారు. తొలి విడతగా ప్రత్యేక కేటగిరి విద్యార్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా సైనిక సంతతి విభాగానికి సంబంధించి తొలిరోజు 48 మంది విద్యార్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. మంగళవారం భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, సైనిక సంతతి విభాగం కేటగిరీలకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.