ద్విచక్ర వాహన ప్రయాణికులు హెల్మెట్ కచ్చితంగా ధరించాలని హెల్మెంట్ లేకుండా డ్రైవింగ్ చేసే వారిపై కేసు నమోదు చేయాలని సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో రహదారి ప్రమాదాల నివారణ పై అధికారులతో ఎస్పీ సమక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేసి వారికి జైలు శిక్ష పడేటట్లు చేయాలన్నారు.