మృతురాలికి పోస్టుమార్టం నిర్వహించకుండా వైద్యులు నిర్లక్ష్యం చేయడంతో ఆమె బంధువులు మంగళవారం గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట రోడ్డుపై ధర్నా చేపట్టారు. పాత గుంతకల్లుకు చెందిన కృష్ణవేణి(26) కడుపునొప్పితో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఐతే మంగళవారం మధ్యాహ్నం వరకూ వైద్యులు పోస్టుమార్టం చేయలేదని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని వైద్యులతో పోస్టుమార్టం చేయించి ఆందోళన విరమింపజేశారు.