ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ సచివాలయానికి చేరుకున్నారు. ఈరోజు అమరావతిపై సీఎం శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. రాజధాని మొదటి దశ పనులను గతంలో టీడీపీ హయాంలోనే తుదిదశకు చేరుకున్నాయి. అయితే అమరావతిపై కక్షకట్టిన జగన్ ప్రభుత్వం... ప్రభుత్వ పెద్దలు, రాజ్యాంగబద్ద పదవుల్లో ఉన్నవారితో అమరావతి శ్మశానం, ఎడారి అంటూ వ్యాఖ్యలు చేయించిన విషయం తెలిసిందే. ఇన్ సైడర్ ట్రేడింగ్ పేరుతో రాజధానిపై బురదజల్లే ప్రయత్నం చేశారు. ఇదే వంకతో అసైన్డ్ రైతులకు కౌలు నిలిపివేశారు.