పామూరు ప్రాథమిక వైద్యశాల పరిధిలోని ప్రజలందరూ ప్రస్తుతం వర్షాలు పడుతున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ సృజన తెలిపారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో ఆమె మాట్లాడుతూ కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని ఆమె సూచించారు. పగటి పూట కుట్టే దోమ వలన డెంగీ వ్యాధి వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలందరూ ఇంటి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగాఉంచుకోవాలని సూచించారు.