రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభలో టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మాట్లాడుతూ.. కేంద్రప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. ఇదే సమయంలో ఈడీ, సీబీఐతో పలువురు రాజకీయ నేతలను బెదిరించి బీజేపీ లొంగదీసుకుంటుందని ఆరోపించారు. దీనిలో భాగంగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబును ఈడీ, సీబీఐ ఎందుకు అరెస్ట్ చేయలేదని, బీజేపీ దర్యాప్తు సంస్థలతో బెదిరించి ఎన్డీయేలో చేర్చుకుందంటూ ఆరోపించారు.