ఒంగోలు నగరపాలక కమిషనర్ జస్వంత్ రావును ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ, యోగ మిత్ర మండలి వాకర్స్ సభ్యులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు కమిషనర్ కు గాంధీ పార్కును ఆధునికరించటంతో పాటు, ప్రహరీ గోడ స్థానంలో ఐరన్ గ్రిల్స్ నిర్మాణం చేపట్టాలని వినతి పత్రం అందజేశారు. అభివృద్ధి చేసుకోవడం వల్ల అన్ని విధాల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని వారు పేర్కొన్నారు.
![]() |
![]() |