టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుపై లోక్‌సభలో టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ చేసిన వ్యాఖ్యలను టీడీపీ నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి తీవ్రంగా ఖండించారు. చంద్రబాబుపై సీబీఐ, ఈడీ కేసులు లేవని, తమ నాయకుడిపై సీఐడీ పోలీసులతో గత వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టించిందని, సమాచారలోపంతో చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరారు.