వైసీపీ పాలనలో రాష్ట్రం ఏ విధంగా విధ్వంసానికి గురైందో, వ్యవస్థలన్నీ ఏ విధంగా నిర్వీర్యం అయ్యాయో కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు వివరించనున్నారు. పారిశ్రామిక రంగాలకు రాయితీ, వ్యవసాయ అనుబంధ రంగాలకు పోత్సాహం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సహకారం అందించేలా కేంద్ర పెద్దలను కోరనున్నారు. ముఖ్యంగా ఏపీలో పోలవరం పూర్తి చేయడం, రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించేలా కేంద్రమంత్రుల ఎదుట ప్రతిపాదనలు పెట్టనున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షాలతోపాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, సీఆర్ పాటిల్ సహా పలువురు కేంద్ర మంత్రులను సీఎం చంద్రబాబు కలవనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు మంత్రులు బీసీ జనార్దన్, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్ సహా తదితరులు ఢిల్లీ టూర్‌కి వెళ్లనున్నారు. కేంద్రంలో ఎన్డేయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు, మోడీ ప్రధాని అయ్యేందుకు చంద్రబాబు కింగ్ మేకర్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. దీంతో ఆంధ్రప్రదేశ్‌పై ఎలాంటి వరాల జల్లు కురవనుందో వేచి చూడాలి.
![]() |
![]() |