దేశవ్యాప్తంగా నీట్ పరీక్షలో జరిగినటువంటి అవకతవకల వలన నష్టపోయే పరిస్థితి ఉందని ఎస్ఎఫ్ఎస్ఐ జిల్లా ఉపాధ్యక్షులు దేవరాజు అన్నారు. మంగళవారం సంతనూతలపాడు లో ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు న్యాయం చేయాలని నీట్ ఎగ్జాం ఏదైతే వివాదం ఉందో వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర విద్యా శాఖ మంత్రిని అలాగే అందులో సహకరించినటువంటి విద్య అధికారులందరినీ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.