జాతీయ పరీక్షా సంస్థలో (ఎన్.టి.ఏ. ఏ) తక్షణ సంస్కరణలు అవసరమని వైయస్ఆర్‌సీపీ తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి అభిప్రాయపడ్డారు. దేశంలో వైద్య విద్యను అభ్యసించేందుకు సుమారు 2.4 కోట్ల మంది విద్యార్థులు "నీట్" ద్వారా పోటీ పడుతుండగా ఈ ప్రతిష్టాత్మక ప్రవేశ పరీక్ష నిర్వహణ బాధ్యత జాతీయ పరీక్షా సంస్థ (ఎన్.టి.ఏ.ఏ)పై ఉందన్నారు. ఇటీవల జరిగిన “నీట్” ప్రవేశ పరీక్షలో అవకతవకలు, ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రాలు పరీక్ష కంటే ముందు బహిర్గతం అయ్యాయి ఇలాంటి ఆరోపణలతో ఆ ప్రవేశ పరీక్ష రద్దు చేయడం. అలాగే యూజీసీ-నెట్ పరీక్ష కూడా రద్దు కావడంతో పలు ఆందోళనలను రేకెత్తిస్తుందన్నారు. ఈ పరిణామాలు సంవత్సరాల తరబడి ఈ ప్రవేశ పరీక్ష కోసం కఠినమైన అభ్యసనా, విలువైన సమయం, పెట్టుబడిగా పెట్టిన అసంఖ్యాక విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తుందని అలాగే జాతీయ పరీక్షా సంస్థ (ఎన్.టి.ఏ.) లోని వ్యవస్థాగత సమస్యలను హైలైట్ చేస్తుందని లోక్ సభ ద్వారా `తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ఇలా పదేపదే జరుగుతున్న వైఫల్యాల వలన ఏర్పడిన అనిశ్చితితో సురక్షితమైన , విశ్వసనీయమైన ప్రవేశ పరీక్ష విధానాన్ని అందించగల జాతీయ పరీక్షా సంస్థ (ఎన్.టి.ఏ.) సామర్థ్యంపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని వైద్య విద్యను అభ్యసించాలి అనుకుంటున్నా ఆశావహుల విశ్వాసం కోల్పోకుండా నిరోధించడానికి, ప్రభుత్వం అత్యవసరంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని గురుమూర్తి కోరారు.