టీడీపీ సెంట్రల్ ఆఫీస్‌పై దాడి కేసులో పోలీసులు వేగం పెంచారు. వైసీపీ పార్టీ చెందిన ఒక్క ఎమ్మెల్సీ ప్రధాన సూత్రధారి అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దాడిలో తాడేపల్లికి చెందిన 7 మంది మాజీ ఎమ్మెల్యే ఆర్కే అనుచరులు పాల్గొన్నట్లు నిర్ధారించారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి 150 మందిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. గుణదల, రాణిగారితోట, కృష్ణలంక, తాడేపల్లి, గుంటుపల్లి, గుంటూరుకు, చెందిన వారే ఎక్కువ మంది దాడిలో ఈ ఘటనలో పాల్గొన్నట్లు గుర్తించారు. దాడిలో పాల్గొన్న నిందితుల కదలికలపై పోలీసులు దృష్టి సారించారు. వైసీపీ నాయకులు అవినాష్, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆర్కే అనుచేరులే టీడీపీ ఆఫీస్‌పై దాడి జరిపినట్లు పోలీసుల విచారణలో బయటపడింది.
![]() |
![]() |