ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కాకినాడ జిల్లాలో మూడో రోజు బుధవారం పర్యటిస్తున్నారు. ఈరోజు ఉదయం 10.45 కు ఉప్పాడలో పర్యటిస్తున్నారు. తీరంలో సముద్రపు కోతను ఆయన పరిశీలిస్తున్నారు. అనంతరం హార్బర్ సముద్ర మొగ వద్ధ మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు పిఠాపురం ఉప్పాడ సెంటర్‌లో వారాహి బహిరంగ సభ జరగనుంది. తనను గెలిపించిన పిఠాపురం నియోజక వర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రసంగిస్తారు. సాయంత్రం ఆరు గంటలకు తిరిగి విజయవాడకు ప్రయాణమవుతారు. ఉప్పాడ తీరంలో ఏడాదిన్నర కాలంగా ఎకరం భూభాగం సముద్రపు కోతలో కలిసిపోయిందని. ఇలా ధ్వంసం కాకుండా అన్ని చర్యలు తీసు కుంటున్నామని పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. బుధవారం చెన్నై నుంచి వచ్చే నిపుణుల బృందం ఉప్పాడ తీరాన్ని పరిశీలించి దాన్ని రక్షణకు అవసరమైన చర్యలు సూచిస్తుందన్నారు. తద్వారా తీర సంరక్షణ చేపడు తున్నట్టు చెప్పారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. కేరళలో అధ్యయనం చేసిన తర్వాత కోనసీమలో కొబ్బరి ఉత్పత్తులను అభివృద్ధి చేస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిధుల సాయంతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సైన్సు అండ్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తామని తెలిపారు. అలాగే నన్నయ్య యూనివర్సిటీలో ఉన్న రీసెర్చ్ స్కాలర్లను తీసుకెళ్లి ఉప్పాడ తీర సం రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేస్తామని చెప్పారు.