కల్తీకల్లు, గంజాయి విక్రయాలను అరికట్టాలని ఆంధ్రప్రదేశ్ ఎరుకల హక్కుల పోరాట సమితి నాయకులు కోరారు. గురువారం వారు హిందూపురం ఎక్సైజ్ సీఐ కు వినతి పత్రం అందజేశారు. తూముకుంట పారిశ్రామిక వాడాలో గంజాయి, కల్తీకల్లు క్రయవిక్రయాలు జరుగుతున్నాయని దీని అరికట్టాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. కళ్ళు తయారిదారులు క్లోరైడ్, హైడ్రెడ్, డైజోఫౌమ్, క్లోరోహైడ్రెడ్ వంటి హానికర పదార్థలను కలిపి విక్రయిస్తున్నారన్నారు.