హిందూపురంలోని అంబేద్కర్ గురుకులాల బాలికల వసతి గృహలలోని విద్యార్థుల బాగోగులపై బహుజన చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు, హైకోర్ట్ న్యాయవాది శివరామ కృష్ణ గురువారం పరిశీలించారు. తన బృందం సభ్యులతో కలసి ఆరాతీశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టిక ఆహారం అందించాలని, విద్యార్థుల రోగాల బారిన పడకుండ మరుగుదొడ్లును, పడక గదులను ఎప్పటికప్పుడు శుభ్రపరచి, వారి ఆరోగ్యంపట్ల జాగ్రత్త వహించలని సూచించారు.