వైసీపీ అధినేత జగన్ మీడియాతో మాట్లాడిన వ్యాఖ్యలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి కౌంటర్ ఇచ్చారు. జగన్ అధికారం పోయిన ప్రెస్టేషన్లోనే నెల్లూరు జైల్ దగ్గర అలా మాట్లాడారన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా పిన్నెల్లిపై కేసులు నమోదు అయ్యాయని, చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేయకముందే ఎన్నికల సంఘం పిన్నెల్లిపై కేసులు పెట్టిందన్నారు. రాజారెడ్డి రాజ్యాంగం పోయి... ఇప్పుడు ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు అవుతుందన్నారు. జగన్ ప్రజలకు మొహం చూపించలేక జైల్లో ఉన్న ఖైదీలకు మొహం చూపిస్తున్నారన్నారు. పిన్నెల్లి ఏమైనా గాంధీ మహాత్ముడా.. చంద్రబాబును హెచ్చరించే అర్హత జగన్కు లేదని శ్రీనివాసులు రెడ్డి అన్నారు.