ఢిల్లీలో రెండో రోజు పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వరుస భేటీలతో బిజీగా ఉన్నారు. కాసేపటి క్రితమే కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌ను చంద్రబాబు కలిశారు. బాబుతో పాటు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని, ఏపీ ఆర్ధికమంత్రి పయ్యావుల కేశవ్, టీడీపీ ఎంపీలు, చీఫ్ సెక్రటరీ నీరాబ్ కుమార్ ప్రసాద్, ఏపీ ఫైనాన్స్ సెక్రటరీ పీయూష్ కుమార్.. కేంద్రమంత్రితో భేటీ అయ్యారు. కేంద్ర బడ్జెట్లో ఏపీ అంశాలకు ప్రాధాన్యత నిధుల కేటాయింపు చేయాలని ఆర్ధికమంత్రిని ఏపీ ముఖ్యమంత్రి కోరారు. అంతకుముందు నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యంను చంద్రబాబు కలిశారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అనంతరం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాతో ఆయన సమావేశమవుతారు. అనంతరం 11:30 గంటలకు కేంద్ర రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో చంద్రబాబు భేటీ అయ్యారు.