గుంతకల్లు డిఆర్ఏం కార్యాలయంలోని ఆర్థిక విభాగంలో సికింద్రాబాద్ కు చెందిన సిబిఐ అధికారులు గురువారం దాడులు చేశారు. ఆర్థిక విభాగంలో పనిచేస్తున్న సీనియర్ డిఎఫ్ఎం ప్రదీప్ బాబు తో పాటు మరి కొందరు సిబ్బంది అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలతో దాడులు చేశారు. కదిరిలో రైల్వే మోరీ నిర్మాణం కోసం కాంట్రాక్టర్ కు పనులు అప్పగించే ఉత్తర్వులు ఇచ్చేందుకు డబ్బులు డిమాండ్ చేసినట్లు సమాచారం అందడంతో దాడులు చేశారు.