శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పరిగి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్మికులకు గత 10 నెలల నుండి జీతాలు చెల్లించకపోవడంతో గ్రామ సచివాలయం ముందు 5వ రోజు శుక్రవారం సమ్మెలో భాగంగా 10 నెలల జీతాలు ఇవ్వకపోతే గడ్డి తిని బ్రతకాల అని నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి రమేష్, పంచాయతి కార్మికులు పాల్గొన్నారు.