గుంతకల్లు పట్టణంలోని బజాజ్ షోరూంలో మెకానిక్ గా పని చేస్తున్న పాత గుంతకల్లుకు చెందిన లోహిత్ కుమార్(24)అను వ్యక్తి శుక్రవారం తెల్లవారుజామున ఇంటిలో ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు ఎమ్మిగనూరుకు చెందిన లక్ష్మీదేవితో రెండేళ్ల క్రితం వివాహం అయింది. ఒక కొడుకు పుట్టి మృతి చెందాడు. అప్పటి నుంచి భార్య కాపురానికి రాకపోవడంతో మనస్తాపంతో ఊరేసుకుని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.