డయేరియా వ్యాధి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తాడివలస ఆరోగ్య కేంద్రం సిబ్బంది స్వాతి, సిహెచ్ ఓ సుగుణమ్మ అన్నారు. శుక్రవారం పొందూరు మండలం తాడివలస ఉన్నత పాఠశాలలో స్టాప్ డయేరియా కార్యక్రమంలో పాల్గొని వారు మాట్లాడారు. వర్షాకాలం కావడంతో నీరు కలుషితం అయ్యే అవకాశం ఉందని, ఈ కలుషిత నీరు తాగడం వల్ల డయేరియా బారిన పడే ప్రమాదం ఉందని తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.