నిబంధనల మేరకే వైయస్ జగన్‌కు ములాఖాత్‌కు అనుమతి ఇచ్చారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి చెప్పారు. వైయస్ జగన్ నెల్లూరు పర్యటన, మాజీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డిని జైల్‌లో వైయస్ జగన్ పరామర్శించడాన్ని తప్పుగా చేస్తున్న ఆసత్య ప్రచారాన్ని కాకాణి గోవర్ధన్‌రెడ్డి తిప్పికొట్టారు. వైయస్ జగన్ పర్యటనతో వైయస్‌ఆర్‌సీపీకి పేరొస్తుందని అడ్డుకునే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. వైయస్ జగన్‌ను అడ్డుకునేందుకు పోలీసులను ఉసిగొల్పాలని చూశారన్నారు. వైయస్ జగన్ పట్ల ప్రభుత్వం ఎక్కడా ఉదారంగా వ్యవహరించలేదన్నారు. అనుకూలంగా ఉండే మీడియా ఛానళ్లలో తప్పుడు కథనాలు ప్రసారాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిన్నెళ్లి వ్యవహారంలోనూ కక్షపూరితంగా వ్యవహరించారని విమర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa