చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించిన ప్రెస్ మీట్ లో ఆత్మస్తుతి పరనింద కనిపించందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే టి జే ఆర్ సుధాకర్ బాబు ఎద్దేవా చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చి నెలరోజులైందని, వారు ప్రజలకిచ్చిన హామీలు అమలు కోసం ఆంధ్రరాష్ట్ర ప్రజలు ఆశగా చూస్తున్నారని ఆయన అన్నారు. సుధాకర్‌బాబు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ...... చంద్రబాబు గొప్ప పరిపాలన అందిస్తారన్న నమ్మకంతో ప్రజలు ఆయనకు గెలిపించి ముఖ్యమంత్రిని చేస్తే… బాబు మాత్రం ఎన్నికల్లో చెప్పిన అబద్దాలనే మరోసారి ప్రధానమంత్రి చెప్పినట్లు ప్రెస్ నోట్ విడుదల చేయడంపై సుధాకర్ బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో పరిపాలన సక్రమంగా చేయలేదని… పాడిన పాటే పాడుతూ చంద్రబాబు జగన్మోహనరెడ్డిగారిని మర్చిపోలేకపోతున్నారన్నారు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్రమంత్రులను కలవడం, వారి భాగస్వామ్య పార్టీకు చెందిన కేంద్ర మంత్రులను కలవడాన్ని ఆహ్వానిస్తున్నామన్న సుధాకర్ బాబు, ఈ పర్యటన ద్వారా రాష్ట్రానికి రావాల్సిన ప్రతి హక్కును సాధించుకురావాలవి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa