కౌలు రైతుకు గుర్తింపు కార్డు తప్పనిసరిగా పొందాలని మెలియాపుట్టి మండల వ్యవసాయ శాఖ అధికారి దానకర్ణుడు అన్నారు. శుక్రవారం ఆయన మెలియాపుట్టి మండలంలోని జాడుపల్లి గ్రామంలో కౌలు రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పంట రుణాలు, ఈ- పంట నమోదు, అన్నదాత సుఖీభవ, పంట నష్టపరిహారం, పంటల భీమా పంట కొనుగోలు, రాయితీపై వ్యవసాయ పరికరాలు కౌలు రైతులకు సైతం అందిస్తామన్నారు. పలువురు అధికారులు పాల్గొన్నారు.