‘నాకు ప్రశాంతమైన పల్నాడు కావాలి. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన దుర్మార్గం చాలు. మళ్లీ అటువంటి ఉదంతాలు జరగడానికి వీల్లేదు అని గురజాల నియోజకవర్గ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. అయన మాట్లాడుతూ... నేను పోలీసులకు చెప్పేది ఒకటే. టీడీపీ వాళ్లు దాడులకు పాల్పడినా కేసులు పెట్టండి. తప్పు ఎవరిదైతే వారిని శిక్షించండి. వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు ఒకటే చెబుతున్నా.. ఎవ్వరూ ఊర్లు వదిలివెళ్లొద్దు. హాయిగా మీ భార్యాపిల్లలతో కలిసి జీవించండి. మీ వ్యవసాయం, వ్యాపారాలు మీరు చేసుకోండి. మీ పనులు మీరు చక్కదిద్దుకోండి. నేను ఎవరిని ఇబ్బంది పెట్టను. ఒకవేళ మావాళ్లు ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే, మీరే నాకు నేరుగా ఫోన్‌చేయండి’ అంటూ గురజాల నియోజకవర్గ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు రెండు రోజుల క్రితం గురజాల నియోజకవర్గ సమీక్షలో నేతలతో అన్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa