శ్రీ సత్య సాయి జిల్లాలోని ఐదు ప్రాంతాల నుంచి వినియోగదారులు ఇసుకను పొందవచ్చని ఆదివారం జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ పేర్కొన్నారు. జిల్లాలోని ఉప్పలపాడు, కొడవండ్లపల్లి, నల్ల బోయినపల్లి, కుటగుళ్ల, రామగిరి స్టాక్ పాయింట్ నుంచి ఇసుక పొందవచ్చు అన్నారు. రోజుకు ఒక వ్యక్తికి 20 టన్నులకు మించకుండా సరఫరా చేస్తామన్నారు. టన్నులకు రూపాయలు. 277 చొప్పున హెడ్డింగ్ చార్జీలు వసూలు చేయనున్నట్లు ఆయన తెలిపారు.