గుంతకల్లు, గుత్తి పట్టణాలలోని డిఎన్టీ, బిసి వసతి గృహాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు పరిష్కారం చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు రమేష్ డిమాండ్ చేశారు. ఆదివారం గుత్తిలోని సంక్షేమ సంక్షేమ వసతి గృహాలలో పర్యటించారు. హాస్టల్లో సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సంధర్బంగా హాస్టల్లోని విద్యార్థులకు గత ఏడు నెలలుగా పెండింగ్లో ఉన్న కాస్మొటిక్ చార్జీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.